దండిగా నిధులు..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత కొన్నేళ్లుగా అనుకున్న స్థాయిలో వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇంటర్ కళాశాలలపై దృష్టిసారించి వారి అవసరాలకు అనుగుణంగా నిధులను మంజూరు చేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2 నుంచి 21 వరకు సైన్స్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనుంది. వీటికి సంబంధించి ల్యాబ్స్ నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటితోపాటు కళాశాలల నిర్వహణ, మైనర్ రిపేర్లు, స్కావెంజర్ల వేతనాలు, స్పోర్ట్స్ వంటి వాటికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోనుంది.
విద్యార్థుల సంఖ్య ఆధారంగా..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. సుమారు 90 వేల మంది మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ల్యాబ్స్ నిర్వహణకు ఒక్కో కళాశాలకు రూ.50 వేలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటితోపాటు ప్రతి కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీకి రూ.10 వేలు, మరుగుదొడ్ల నిర్వహణకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఒక్కరు లేదా ఇద్దరు స్కావెంజర్స్‌కు వేతనాలు ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా వరకు పాత కళాశాలల భవనాలు ఉండడంతో వాటి మైనర్ రిపేర్ల కోసం కూడా నిధులు ఇచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.5.5 కోట్ల ఇవ్వగా మహబూబ్‌నగర్ జిల్లాకు రూ.2.03 కోట్లు ఇచ్చారు. ఒక్క బాలికల జూనియర్ కళాశాలకు మాత్రమే రూ.22 లక్షలు కేటాయించింది.
జిల్లా కళాశాలలు ల్యాబ్‌ల స్పోర్ట్స్‌కు నిధులు
నిర్వహణ (రూ.లక్షల్లో..)
మహబూబ్‌నగర్ 15 7.50 1.50
నారాయణపేట 10 5.00 1.00
నాగర్‌కర్నూల్ 16 8.00 1.60
వనపర్తి 12 6.00 1.20
జో.గద్వాల 8.00 4.00 0.80
ఇంటర్ కళాశాలల ల్యాబ్‌ల నిర్వహణకు రూ.50 వేలు
స్పోర్ట్స్ కోసం రూ.10 వేలు, స్కావెంజర్లకు వేతనాలు
మైనర్ రిపేర్ల నిమిత్తం మహబూబ్‌నగర్‌కు రూ.2.03 కోట్లు కేటాయింపు
ఉమ్మడి జిల్లాలోని 61 కళాశాలల్లో 90 వేల మంది విద్యార్థులు
జిల్లాల వారీగా కళాశాలలు, నిధులు ఇలా..
ఇబ్బందులు తీరుతాయి..
వచ్చే నెల 2 నుంచి ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో ల్యాబ్స్ నిర్వహణకు ప్రభుత్వం రూ.50 వేలు ఇచ్చింది. ఇక స్పోర్ట్స్ కోసం ప్రతి కళాశాలకు రూ.10 వేలు, స్కావెంజర్‌లకు వేతనాలను కూడా ఇస్తుంది. దీంతో కళాశాలల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి మొత్తం 21 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. – కౌసర్‌జహాన్, డీఐఈఓ, మహబూబ్‌నగర్
దండిగా నిధులు..


