19 నుంచి జోగుళాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు
అలంపూర్: పట్టణంలోని శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారి వార్షిక బ్రహోత్సవాలు, మహాశివరాత్రి మహోత్సవ కరపత్రాలు, ఆహ్వాన పత్రికలను, శ్రీజోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల 2026 క్యాలెండర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే విజయుడుతో కలిసి ఆలయ ఈఓ దీప్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. ఈ నెల 19, సోమవారం నుంచి 23, శుక్రవారం వరకు శ్రీజోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహోత్సవాలు కొనసాగుతాయన్నారు. ఫిబ్రవరి 14 శనివారం నుంచి 18, బుధవారం వరకు శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనిఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.
ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే
దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి, శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. శేషవస్త్రాలతో సత్కరించారు.
కరపత్రాలు విడుదల చే సిన ఎమ్మెల్యే విజయుడు,ఈఓ దీప్తి


