దేవరకద్ర ఆర్‌యూబీకి త్వరలో టెండర్లు
● రైల్వే జీఎంను కలిసిన
ఎంపీ డీకే అరుణ
దేవరకద్ర: దేవరకద్ర పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆర్‌యూబీ నిర్మించడానికి గతంలో ఎంపీ డీకే అరుణ స్వయంగా సమస్యను పరిశీలించి రైల్వే శాఖకు ప్రతిపాద నలు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్‌యూబీకి సంబంధించి మంజూరు ఉత్తర్వులను జారీ చేసి ఫి బ్రవరిలో పనులకు సంబంధించి టెండర్లు పిలుస్తా రని రైల్వే అధికారులు వెల్లడించారు. ఎంపీ డీకే అరుణ సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్‌సెంట్ర ల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవను కలిసి ఆర్‌యూబీ, ఆర్‌ఓబీ, ఎల్‌హెచ్‌ఎస్‌కు సంబంధించి చర్చించారు. ఆర్వోబీ నిర్మా ణం తర్వాత దేవరకద్ర పరిసర గ్రామాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్‌యూబీ మంజూరు చేయడంతో ఇబ్బందులు దూరమవుతాయని ఎంపీ తెలిపారు. త్వరలో పనులు పూర్తి చేసి ఆర్‌యూబీని అందుబాటులోకి తేవాలని కోరారు.


