ప్రయాణికుల సౌకర్యార్థం..
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలు, బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, అదనపు వలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా తాగునీటి వసతి, కూర్చోవడానికి కుర్చీలు, బస్సుల వివరాలు, సూచనలను ఎప్పటికప్పుడూ ప్రయాణికులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోండి
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని డిపోల నుంచి అదనపు బస్సులు నడపనున్నాం. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. సురక్షితమైన ప్రయాణానికి ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలి.
– సంతోష్‌కుమార్, ఆర్టీసీ ఆర్‌ఎం


