సమసమాజనిర్మాణమే లక్ష్యం
మెట్టుగడ్డ: సామాజిక సేవలు, వృద్ధుల సమస్యల పరిష్కారం, సమ సమాజ నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమని సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు అన్నారు. గురువారం ఫోరం విసృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా సీనియర్ సిటిజన్ మహిళలకు ఫోరం భవనం ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామ ని తెలిపారు. ఫోరం భవన ప్రహరీ మరమ్మతుల పనులు, వృద్ధులకు ఆహ్లాదకరమైన వా తావరణం కోసం లాన్ ఏర్పాటు పనులు ము మ్మరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ఫోరం సభ్యత్వం రూ.పది వేలకు పెంచే దిశగా డ్రైవ్ చేపట్టామని తెలిపారు. సభ్యత్వం పొందిన నూతన సభ్యులను సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు రామేశ్వరయ్య, ఉపాధ్యక్షుడు రాజసింహుడు, ప్రధాన కార్యదర్శి ఎన్.నాగభూషణం, సంయుక్త కార్యదర్శి గంగాధర్, జి.నాగభూషణం, రాములు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
పాలమూరు: రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి స్థానిక పార్టీ కార్యాలయంలో స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి రోజు 180 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈనెల 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, 15 నుంచి 20 వరకు దరఖాస్తుల పరిశీస్తామని చెప్పారు. 8 వార్డులకు కలిపి ముగ్గురు చొప్పున సీనియర్ నాయకులను నియమించినట్లు తెలిపారు. 1వ వార్డు నుంచి 8వ వార్డు వరకు జి.పద్మజారెడ్డి, పోతుల రాజేందర్‌రెడ్డి, పడాల సత్యం, 9 నుంచి 18 వరకు పడాకుల బాల్‌రాజు, క్రిస్టియానాయక్, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు యాదయ్య, 19 నుంచి 23 వార్డు వరకు వీరబ్రహ్మచారి, కిరణ్‌కుమార్‌రెడ్డి, కె.సతీష్‌కుమార్, 24 నుంచి 30 వరకు నాగేశ్వర్‌రెడ్డి, అంజయ్య, జాజం సుబ్రహ్మణ్యం, 31 నుంచి 38 వరకు కృష్ణవర్ధన్‌రెడ్డి, జయశ్రీ, కొండయ్య, 39 నుంచి 45 వార్డు వరకు ఎస్.పాండురంగారెడ్డి, కర్ణాకర్‌రెడ్డి, గడ్డ బుచ్చన్న, 46 నుంచి 52 వార్డు వరకు మెట్టుకాడి శ్రీనివాసులు, రామాంజనేయులు, నవీన్‌రెడ్డి, 53 నుంచి 60 వార్డు వరకు కె.రాములు, బుచ్చిరెడ్డి, ఎన్.రమేష్‌కుమార్‌లను నియమించినట్లు తెలిపారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.2,739
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,739, కనిష్టంగా రూ.2,409 ధరలు లభించాయి. హంస రూ.1,916, కందులు గరిష్టంగా రూ.7,560, కనిష్టంగా రూ.5,667, వేరుశనగ గరిష్టంగా రూ.8,781, కనిష్టంగా రూ.3,051, ఉలువలు రూ.3,517, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,927, కనిష్టంగా రూ.1,841, పత్తి గరిష్టంగా రూ.7,370, కనిష్టంగా రూ.7,149 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో కందులు గరిష్టంగా రూ.6,789, కనిష్టంగా రూ.6,769 ధర లభించింది.
సమసమాజనిర్మాణమే లక్ష్యం


