పర్యావరణానికి ముప్పులేదు..
నారాయణపేట: మక్తల్–నారాయణపేట–కొడంగ ల్ ఎత్తిపోతల పథకం చేపడితే ఈ ప్రాంతంలో ఎలాంటి పర్యావరణ ముప్పు.. విఘాతం కలగడం లేదని, వీలైనంత త్వరగా ఆ పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చి ప్రారంభించాలని ప్రజలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం మక్తల్ –నారాయణపేట –కొడంగల్ ఎత్తిపోతల పథకంపై జిల్లాలోని దామరగిద్ద తండాలో గురువారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఈఈ సురేష్ హాజరు కాగా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్, నీటి పారుదల శాఖ ఎస్. ఈ శ్రీధర్ సమక్షంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని 7 మండలాల నుంచి ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఏకాభిప్రాయాన్ని బృందం ముందు వెల్లడించారు. వందలాది మంది సమక్షంలో 28 మంది తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పనులను త్వరగా ప్రారంభించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని, ఆ పథకం పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని ఆకాంక్షించారు.
మక్తల్– పేట– కొడంగల్ ప్రాజెక్టుకు అనుమతివ్వాలి
ఉద్యమాలు, పోరాటాలతో ప్రాజెక్టు సాధించుకున్నాం
ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలి
పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించిన ప్రజలు
మూడు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల నుంచి హాజరు
పర్యావరణానికి ముప్పులేదు..


