మామిడిలో పూత, పిందె
చీడ పీడలు
మామిడికి చీడపీడలు పూత, పిందె దశలో ఆశించడం వలన పూత, పిందె బాగా రాలుతుంది. పురుగులు, తెగుళ్లను జాగ్రత్తగా గమనిస్తూ చర్యలు తీసుకోవాలి.
తేనె మంచు పురుగు: పూత, పిందె దశలో ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చి వేయడం వలన పూత మాడిపోతుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్‌ను తగిన మోతాదులో వాడుకోవాలి.
తామర పురుగులు: తామర పురుగులు రసాన్ని పీల్చడం వలన పూత రాలిపోతుంది. పిందె దశలో కాయపై గోకి రసాన్ని పీల్చడం వలన మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఆశించిన కాయలపై మంగు ఏర్పడుతుంది. వీటి నివారణకు డైమిథోయేట్ 2 మి.లీ/ లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగులు: ఆకులు, పూత, పిందెలపై తెల ్లని బూడిద వంటి పొడి ఏర్పడుతుంది. తెగులు సోకిన పూత, పిందెలు రాలిపోతాయి. దీని నివారణకు పూత మొగ్గ దశలో హెక్సాకొనజోల్/మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
అలంపూర్: మామిడిలో పూత, పిందె ఎక్కువగా వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పూతను, పిందెను నిలుపుకొని నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే తగు జాగ్రత్తలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతలకు వివరిస్తున్నారు.
మామిడిలో పూల రకాలు : మామిడిలో ఉండే పూలగుత్తుల్లో రెండు రకాలు పుష్పాలు ఉంటాయి. ఒక రకం ద్విలింగ పుష్పాలు, రెండో రకం మగ పుష్పాలు. ప్రతి పూలగుత్తిలో రకాన్ని బట్టి 200 నుంచి 4,000 వేల వరకు పుష్పాలు ఉంటాయి. ద్విలింగ పుష్పాలు రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు రుమాని రకంలో 0.74 శాతం, నీలం రకం 55 శాతం, లాంగ్రా రకం 69 శాతం, బంగనపల్లిలో 22 శాతం ద్విలింగ పుష్పాలు ఉంటాయి. ద్విలింగ పుష్పాలు మాత్రమే ఫలిదీకరణం చెంది పిందెలుగా ఏర్పడతాయి. మగపూలు ఫలదీకరణలో తోడ్పడి తర్వాత రాలిపోతాయి. ద్విలింగ పుష్పాల్లో కూడ ఫలదీకరణానికి ముందే పలు కారణాల వలన రాలిపోతాయి.
పోషకాల యాజమాన్యం: మామిడి కాయలు అంగుళం పరిమాణం నుంచి భుజాలు ఏర్పడే వరకు చాలా త్వరగా పెరుగుతాయి. ఈ సమయంలో పోషకాలైన నత్రజని, పొటాష్‌ను తప్పక అందించాలి. నీటి వసతి ఉన్న పొలాల్లో చెట్టు వయస్సును బట్టి 500 గ్రాముల నుంచి కేజీ వరకు, 300 గ్రాముల పొటాష్‌ను పిందెలు బాదం కాయ పరిమాణం ఉన్నప్పుడు వేసి నీరు పెట్టాలి. నీటి వసతి లేని తోటల్లో నీటిలో కరిగే ఎరువులైన పాలీఫీడ్, మల్టీ–కే ఎరువులు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
హార్మోన్ల యాజమాన్యం: హార్మోన్ల లోపం, సమతుల్యత దెబ్బతింటే పూత, పిందె బాగా రాలుతుంది. దీని నివారణకు ప్లానోఫిక్స్‌ను 5 లీటర్ల నీటిలో/మి.లీ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మోతాదుకు మించి పిచికారీ చేస్తే పిందె రాలిపోయే ప్రమాదం ఉంది.
పాడి–పంట


