సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోడియం తొలగింపు
మెట్టుగడ్డ: రిజిస్ట్రేషన్ల శాఖలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీకి స్వస్తి పలుకుతూ సబ్ రిజిస్ట్రార్లు కూర్చునే ఎత్తైన పోడియాలను తొలగించారు. రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశాలతో అన్ని కార్యాలయాల్లో పారదర్శకమైన వాతావరణం కల్పించేలా తీసుకున్న సంస్కరణల్లో భాగంగా ఈ చర్యను చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 కార్యాలయాల్లో ఎత్తైన పోడియాలను తొలగించారు. నిజాంకాలం నుంచే సబ్ రిజిస్ట్రార్‌లకు ప్రత్యేక అధికారాలుండేవి. వారికి కొన్ని జ్యుడిషియల్ అఽధికారాలను చట్టం కల్పించింది. డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసే సమయంలో క్రయ, విక్రయదారుల, సాక్షుల స్టేట్‌మెంట్ తీసుకోవడం, వీలునామాలను విచారించే అధికారాలు ఉండటంతో వారికి న్యాయస్థానాల తరహాలో పోడియాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాధారణ టేబుళ్లపై సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వహిస్తుండటం గమనార్హం.
సాధారణ టేబుళ్లపైనే విధి నిర్వహణ
దశాబ్దాల ఆనవాయితీకి స్వస్తి
రిజిస్ట్రేషన్ల శాఖలో కీలక మార్పులు..
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోడియం తొలగింపు


