ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: ఆదిలాబాద్‌లో ఈ నెల 18న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను గురువారం మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎంపికల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అండర్–8, 10, 12, 14 విభాగాలకు సంబంధించి రన్నింగ్, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, లాంగ్‌జంప్, లాంగ్‌జంప్ (స్టాండింగ్ బ్యాక్ త్రో), హైజంప్, షాట్‌పుట్, 20 ఏళ్ల లోపు వారికి 100 మీటర్ల, 400 మీటర్ల పరుగు అంశాల్లో ఎంపికలు నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారుల వివరాలు తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీడీలు ఆనంద్‌కుమార్, పి.శ్రీనివాస్, జి.రాజు, బాలరాజయ్య తదితరులు పాల్గొన్నారు.


