ఫిబ్రవరి 3న జడ్చర్లకు సీఎం రాక | - | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 3న జడ్చర్లకు సీఎం రాక

Jan 9 2026 11:14 AM | Updated on Jan 9 2026 11:14 AM

ఫిబ్రవరి 3న జడ్చర్లకు సీఎం రాక

ఫిబ్రవరి 3న జడ్చర్లకు సీఎం రాక

జడ్చర్ల టౌన్‌: ఫిబ్రవరి 3న బాదేపల్లి హైస్కూల్‌ శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నారని జడ్చర్లఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి వెల్లడించారు. గురువారం హైస్కూల్‌ శతాబ్ది ఉత్సవ కమిటి రూపొందించిన లోగోను ఆయన క్యాంప్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీతోసమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 3న ట్రిపుల్‌ ఐటీ శంకుస్థాపనకు సీఎం రానున్నారని, ముందుగా హైస్కూల్‌ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ట్రిపుల్‌ ఐటీ శంకుస్థాపన చేస్తారన్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుందామన్నారు. ఉత్సవాలు జయప్రదం చేసేందుకు తనవంతుగా పూర్తి సహకారం అందిస్తానని, ఉత్సవ కమిటీ, పాఠశాల ఉపాధ్యాయ బృందం సమష్టిగా ముందుకు సాగాలన్నారు. ఉత్సవాలకు సీఎంతో పాటు ముగింపు వేడుకలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను ఆహ్వానిద్దామన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవిశంకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.కృష్ణ, ప్రధానకార్యదర్శి రమణాచార్యులు, ఆహ్వానకమిటీసభ్యులు ఎంఈఓ మంజులాదేవి, గోవింద్‌నాయక్‌, హెచ్‌ఎం చంద్రకళ, కమిటీ సభ్యులు జయప్రకాష్‌, ఆకుల వెంకటేశ్‌, సూరి, మేడిశెట్టి రామకృష్ణ, శ్రీహరి, సంతోష్‌, సూరి, రాజుగౌడ్‌, టైటాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement