మళ్లీ పెరిగిన ఉల్లి ధర
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. రెండు వారాలుగా దిగి వచ్చిన ఉల్లి ధరలు ఈ వారంలో కొంత వరకు పెరుగుదల కనిపించింది. మార్కెట్‌కు దాదాపు వేయి బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. ఎర్ర ఉల్లికి తక్కువగా, తెల్లగా ఉన్న ఉల్లికి ఎక్కువ ధర పలికింది.
జోరుగా సాగిన వేలం...
దేవరకద్ర మార్కెట్‌లో తెల్లగా ఉండి నాణ్యతగా ఉన్న ఉల్లిని కొనడానికి వ్యాపారులు పోటీ పడగా.. గరిష్టంగా రూ. 2,100 వరకు ధర పలికింది. ఇదే వరుసలో కొంత నాణ్యత తక్కువగా ఉన్న ఉల్లికి క్వింటాల్‌కు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు ధరలు లభించాయి. ఎర్ర ఉల్లికి గరిష్టంగా రూ.1,500 వరకు ధర రాగా.. కనిష్టంగా రూ.1,100 పలికింది. మార్కెట్‌లో చిరు వ్యాపారులతో పాటు వినియోగదారులు ఉల్లిని ఎక్కువగా కొనుగోలు చేశారు. 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ.1,050, కనిష్టంగా రూ.900, ఎర్ర ఉల్లి గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.500 పలికాయి.
● గరిష్టంగా రూ.2,100
● కనిష్టంగా రూ.1,500


