ఉత్సాహంగా నెట్‌బాల్ జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: తెలంగాణ పురుషుల, మహిళా నెట్‌బాల్ జట్ల చివరి ఎంపిక ట్రయల్స్‌ను బుధవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. త్వరలో జరిగే సీనియర్ నేషనల్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్న తెలంగాణ జట్ల ఎంపికలు బుధవారం నిర్వహించగా.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరైనట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఎంపికలకు ఉత్తరాఖండ్‌కు చెందిన సురేందర్ పరిశీలకుడిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధి అంజద్‌అలీ తదితరులు పాల్గొన్నారు.


