మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
దేవరకద్ర రూరల్: మనస్తాపంతో గడ్డి మందు తాగి, చికిత్స పొందుతూ విద్యార్థి మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానిక వివరాల ప్రకా రం.. బోల్లారం గ్రామానికి చెందిన పవన్‌కుమార్ (18) జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో చిన్న గొడవ జరగడంతో సోమవారం చిన్నచింతకుంటలో ఉన్న అక్క దగ్గరికి వెళ్లాడు. అదేరోజు సాయంత్రం అక్కడే ఉన్న వ్యవసాయ పొలానికి వెళ్లి గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఉన్న ఒక్కగానొక్క కూమారుడి మృతితో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి.
మహిళ
అనుమానాస్పద మృతి
చిన్నంబావి: మండలంలోని కొప్పునూరు శివా రులో ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు సీఐ కృష్ణ తెలిపారు. ఆయ న కథనం మేరకు.. మండలంలోని బెక్కం గ్రామానికి చెందిన గుంటి రాధ (40) ఈ నెల 1న బీ చుపల్లికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటిని నుంచి బ యలుదేరింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో మండలంలోని అమ్మాయిపల్లికి చెందిన మౌలాలిపై అనుమానం వ్యక్తం చేస్తూ కు మార్తె గుంటి మేఘన 4వ తేదీన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశా రు. కొప్పునూరు శివారులో మహిళ మృతదేహం ఉన్నట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి రాధ మృతదేహంగా నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు న మోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు సీఐ వివరించారు. ఇదిలా ఉండగా.. రాధ కు ఓ కుమార్తె ఉండగా భర్త అనారోగ్యంతో ఐదేళ్ల కిందట మృతిచెందాడు. మహిళ మృతికి వివాహేతర సంబంధమే కారణంగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చోరీ కేసులో
వ్యక్తికి రిమాండ్
ఖిల్లాఘనపురం: మద్యం దుకానంలో చోరీ చేసిన ఓ వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ ఐ వెంకటేష్ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. ఖిల్లాఘనపురం మండల కేంద్రంలోని దుర్గా వైన్స్‌లో 2025 జూలైలో చోరీ చోటుచేసుకుంది. సెల్‌ఫోన్‌తోపాటు కొన్ని డబ్బులు పోయినట్లు వైన్‌షాపు వారు ఫిర్యాదు చేశారు. నాటినుంచి దొంగల కోసం వెతికినా పోలీసులు ఎట్టకేలకు దొంతనంలో పాల్గొన్న మొహమూద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని వనపర్తి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. న్యాయమూర్తి అతనికి జ్యూడిషియల్ రిమాండ్ విదించడం జరిగిందని ఎస్సై తెలిపారు. దొంగతనంలో పాల్గొన్న మరోదొంగ పరారీలో ఉన్నాడని, దొంగ దగ్గరి నుంచి రూ.10వేల విలువ చేసే సెల్‌ఫోన్‌ను జప్తు చేసినట్లు పేర్కొన్నారు.
ఏటీఎం చోరీకీ
విఫలయత్నం
రాజాపూర్: గుర్తు తెలియని దొంగలు మండల కేంద్రంలోని ఓ ఏటీఎంలో చోరీ చేసేందుకు మిషన్‌ను ధ్వంసం చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుర్తు తెలియని దొంగలు బుధవారం తెల్లవారుజామున రాజాపూర్ ఎక్స్‌రోడ్డు పక్కన ఉన్న ఇండియావన్ అనే ఏటీఎం సెంటర్‌లోకి ప్రవేశించి ఇటుకతో మిషన్‌ను ధ్వంసం చేసి అందులో ఉన్న డబ్బులు తీసుకునే ప్రయత్నం చేసినా.. సాధ్యం కాలేదు. ఇంతలోనే రోడ్డుపై శబ్దం రావడంతో దొంగలు పారిపోయినట్లు ఏటీఎం మెయిన్‌టెనెన్స్ సూపర్‌వైజర్ సంతోష్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుతున్నట్లు ఎస్‌ఐ శివానందంగౌడ్ తెలిపారు.
మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య


