పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
మహబూబ్‌నగర్ క్రైం: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బుధవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. భూత్పూర్ మండలం కొత్తూర్‌కు చెందిన సత్తయ్య 2023, మే 23న ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భూత్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. బుధవారం కోర్టులో 8 మంది సాక్షుల వాదనలు విన్న తర్వాత నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సత్తయ్యకు 20 ఏళ్ల కఠిన కారాగార జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. అలాగే బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. కేసులో నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన భూత్పూర్ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ డి.జానకి అభినందించారు.
తండ్రి కళ్లెదుటే మూడేళ్ల కుమారుడి మృతి
పెద్దకొత్తపల్లి: తండ్రి కళ్లెదుటే మూడేళ్ల కుమారుడు మృతిచెందిన విషాదకర ఘటన పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాలిలా.. గ్రామానికి చెందిన మల్లేష్ వ్యవసాయ పనుల నిమి త్తం పొలానికి వెళ్తుండగా.. కూడా అతని మూ డేళ్ల కుమారుడు మిట్టు వెళ్లాడు. తండ్రి మల్లేష్ ట్రాక్టర్‌కు రోటోవేటర్‌ను అమర్చే పనిలో ఉండగా.. అక్కడే ఆ డుకుంటున్న బాలుడు మిట్టు అనుకోకుండా రోటోవేటర్ వద్దకు వెళ్లాడు. అ ది గమనించని తండ్రి రోటోవేటర్‌ను కిందికి దించగా ప్రమాదవశాత్తు అక్క డే ఉన్న బాలుడిపై పడింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోయాడు. అప్పటివరకు కళ్ల ముందు బుడిబుడి అడుగులు వేస్తూ.. ఆడుకుంటున్న కుమారుడు విగతజీవిలా మారడంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.
● ట్రాక్టర్‌కు రొటోవేటర్ అమర్చుతుండగాప్రమాదవశాత్తు
బాలుడిపై పడిన వైనం


