‘ బీఆర్‌ఎస్‌ నేతల మాటల హాస్యాస్పదం’ | - | Sakshi
Sakshi News home page

‘ బీఆర్‌ఎస్‌ నేతల మాటల హాస్యాస్పదం’

Jan 8 2026 9:02 AM | Updated on Jan 8 2026 9:02 AM

‘ బీఆర్‌ఎస్‌ నేతల మాటల హాస్యాస్పదం’

‘ బీఆర్‌ఎస్‌ నేతల మాటల హాస్యాస్పదం’

వైఎస్సార్‌ ఘనతే..

వనపర్తి టౌన్‌: రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పుడు అప్పటి సీఎం కేసీఆర్‌ నోరు తెరవకపోవడంతో 11వేల క్యూసెక్కుల నుంచి 99 వేల క్యూసెక్కుల నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు తరలిస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు నుంచి భవిష్యత్‌లో ఎవరూ సీఎం కాలేరని, రేవంత్‌రెడ్డిని ఆదరించి పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదామన్నారు. జూరాల సోర్స్‌గా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టి, కొడంగల్‌ లిఫ్టును అనుసంధించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నల్గొండకు నీళ్లు ఇచ్చేందుకు కేసీఆర్‌ శ్రీశైలం సోర్స్‌గా రాత్రిరాత్రికే నిర్ణయం తీసుకొని పాలమూరుకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. రూ.55వేల కోట్లతో ప్రాజెక్టు చేపట్టి రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అదనంగా రూ.6వేల కోట్లను పాలమూరు–రంగారెడ్డికి ఖర్చు చేశామన్నారు. కేసీఆర్‌ కట్టిన ప్రాజెక్టులతో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని, నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్‌ వరకు పనులు చేసి ఆ తర్వాత కాల్వలు తీయలేదని, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ కట్టకుండా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలోని డిండికి శ్రీశైలం సోర్స్‌గా నీరు తీసుకోవాలని క్యాబినేట్‌లో తాను ప్రస్తావించిన కేసీఆర్‌ పట్టించుకోలేదని ఆరోపించారు. కేవలం రూ.300 కోట్ల ఖర్చు పెట్టి వట్టెం నుంచి నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉన్నా.. రూ.1,800 కోట్లతో ఏదుల రిజర్వాయర్‌ నుంచి నీళ్లు తీసుకెళ్లేందుకు పరిపాలన అనుమతులిచ్చిచారని మండిపడ్డారు.

పాలమూరులోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను రూ.7వేల కోట్లతో దివంగత సీఎం వైఎస్సార్‌ చేపట్టారని చిన్నారెడ్డి తెలిపారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆ ప్రాజెక్టులను తానే చేసినట్లు చె ప్పుకోవడం సరికాదని హితువు పలికారు. ఏపీ సీఎం చంద్రబాబుకు సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవ డం అలవాటే అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ వ ల్లే పాలమూరులో తాగు, సాగునీరు ఇబ్బందు లు తొలిగాయన్నారు. వైఎస్సార్‌ బతికి ఉంటే 2011లోనే ప్రాజెక్టులు పూర్తయ్యేవని, కేసీఆర్‌ ప్ర భుత్వం వైఎస్సార్‌ చేపట్టిన ప్రాజెక్టులకు ఏ మా త్రం నిధులు కేటాయించలేదని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement