ముగిసిన పీఎంశ్రీ జిల్లా స్పోర్ట్స్ మీట్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న పీఎంశ్రీ జిల్లాస్థాయి స్పోర్ట్స్‌మీట్ బుధవారం ముగిశాయి. చివరి రోజు బాలబాలికలకు ఖోఖో, అథ్లెటిక్స్, బాలురకు ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించారు. ఖోఖో బాలుర విభాగంలో బాదేపల్లి (బాలుర) ప్రథమ, నవాబ్‌పేట ద్వితీయ, బాలికల్లో బాలానగర్ ప్రథమ, చిన్నచింతకుంట ద్వితీయ, ఫుట్‌బాల్ బాలురలో రాజాపూర్ ప్రథమ, బాదేపల్లి (బాలుర) ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. అథ్లెటిక్స్ అంశాల్లో 100 మీటర్ల పరుగులో బాలుర విభాగంలో పాల్ జెడ్పీహెచ్‌ఎస్ బాదేపల్లి (బాలుర) ప్రథమ, కె.శ్రీనాథ్ జెడ్పీహెచ్‌ఎస్ నవాబ్‌పేట ద్వితీయ, షాట్‌పుట్‌లో గణేష్ జెడ్పీహెచ్‌ఎస్ గార్లపాడ్ ప్రథమ, శ్రీకాంత్ జెడ్పీహెచ్‌ఎస్ కావేరమ్మపేట ద్వితీయ, లాంగ్‌జంప్‌లో సందీప్ జెడ్పీహెచ్‌ఎస్ అడ్డాకుల ప్రథమ, రితిషరాజ్ జెడ్పీహెచ్‌ఎస్ కావేరమ్మపేట ద్వితీయ, బాలికల విభాగంలో 100మీటర్ల పరుగులో అనూష జెడ్పీహెచ్‌ఎస్ బాలానగర్ ప్రథమ, హేమలత టీజీఆర్‌ఎస్ బాలానగర్ ద్వితీయ, షాట్‌ఫుట్‌లో రమ్య టీఆర్‌ఐఈఎస్ బాలానగర్ ప్రథమ, కె.శ్రీవల్లిక కేజీబీవీ చిన్నచింతకుంట ద్వితీయ, లాంగ్‌జంస్‌లో జి.కావేరి కేజీబీవీ భూత్పూర్ ప్రథమ, అక్షయ జెడ్పీహెచ్‌ఎస్ నవాబ్‌పేట ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఆయా క్రీడాపోటీలో గెలుపొందిన వారికి జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, క్రీడల ఇన్‌చార్జీ వేణుగోపాల్, పెటాటీఎస్ జిల్లా అధ్యక్షులు జగన్‌మోహన్‌గౌడ్ తదితరులు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో పీడీలు వడెన్న, రమేష్‌బాబు, ఆనంద్‌కుమార్, మొగులాల్, కృష్ణ పాల్గొన్నారు.
ముగిసిన పీఎంశ్రీ జిల్లా స్పోర్ట్స్ మీట్


