ఢిల్లీలో ఒగ్గు కళా ప్రదర్శనకు పీజీ విద్యార్థి ఎంపిక
కొల్లాపూర్:కొల్లాపూర్ ప్రభు త్వ పీజీ కళాశాలలో ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్స రం చదువుతున్న కె.శివరాజ్ ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒగ్గు కళా ప్రదర్శనకు ఎంపికయ్యారు. జానపద కళల్లో విశేష ప్రతిభ కనబర్చి న శివరాజ్ ఈనెల 26 వతేదీన జరగనున్న గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇచ్చేందుకు ఎంపిక చేశారు. ఈనెల 8వ తేదీ నుంచి జరిగే రిహార్సల్ కు ఆయన హాజరుకానున్నారు. శివరాజ్ ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపల్ మార్క్‌పోలోనియస్‌తోపాటు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
రేపు పీయూలో
ప్రాంగణ ఎంపికలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కే12 టెక్నో సర్వీసెస్ ఆధ్వర్యంలో పీయూలో గురువారం ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ప్లేస్‌మెంట్ అధి కారి అర్జున్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని, ఉదయం 10 గంటలకు ఎంపికలకు అభ్యర్థులు బయోడేటాతో రావాలని, మరింత సమాచారం కోసం 9849445877 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
పేగు బంధం.. లేదు పొమ్మంది
మరికల్: కన్నబిడ్డల కడసారి చూపును చూసు కో ను, మాజీ భర్త పార్థీవ దేహానితో సంబంధం లే దు అన్న సదరు మహిళ తీరుపై మండలంలోని తీలేర్ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నా రు. పూర్తి వివరాలు.. తీలేర్ గ్రామానికి చెందిన శివరాములు భార్య లేని జీవితం తనకు, తన ఇద్దరి పిల్లలకు ఎందుకని పిల్లలను దారుణంగా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న విష యం తెలిసిందే. నా భార్య విడాకులు ఇవ్వడం వల్లే ముగ్గురం కలిసి ఆత్మహత్య చేసుకున్నామని మరణ వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని పోలీసులు పిల్లల తల్లికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. తనకు ఏమీ సంబంధం లేదని పోలీసులకు చెప్పడం, కన్నపిల్లల చివరి చూపునకు రాని కర్కశ తల్లి తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు చిన్నారుల అంత్యక్రియలు పూర్తి చేశారు. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారుల తండ్రి శివరాములు అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు.


