ముగిసిన పర్వతాపూర్ మైసమ్మ ఉత్సవాలు
నవాబుపేట: మండలంలోని పర్వతాపూర్ మైసమ్మ దేవత ఉత్సవాలు బుధవారం జరిగిన ప్రత్యేక పూజలు మహామంగళహారతితో ముగిశాయి. వారంరోజులు జరిగిన ఉత్సవాలను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి హారతినిచ్చి కార్యక్రమాలను ముగించినట్లు ఆలయ అధికారి నర్సింహులు, చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కాగా, ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు, వసతులు ఏర్పాటు చేసిన సభ్యులు, పోలీస్, వైద్యసిబ్బందికి ఆలయ కమిటీ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాకర్లపహాడ్ సర్పంచ్ బాలయ్య, ఆలయ సిబ్బంది శ్రీకాంత్‌శర్మ, గోపాల్, మల్లేశ్, నర్సింహులు, మాజీ చైర్మన్ గోపాల్, సుభాన్‌చారి, వేణాచారి, మైనోద్దిన్, నరేందర్, మాధవులు, బాలయ్య, వెంకటయ్య, శ్రీను, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
● మైసమ్మ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి హుండీలను బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా హుండీలో కిలో వెండి ఆభరణాలు, 6మాసాల బంగారు ఆభరణాలు, రూ.1,11,413 నగదు కానుకలు సమర్పించారు.
ముగిసిన పర్వతాపూర్ మైసమ్మ ఉత్సవాలు


