క్రికెట్‌లో విద్యార్థులు సత్తా చాటాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు క్రికెట్‌లో సత్తా చాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎండీసీ క్రికెట్ గ్రౌండ్‌లో సౌత్‌జోన్ యూనివర్సటీ, ఆల్‌ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కిక్రెట్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్‌లో రాణించే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపికలు పూర్తయిన తర్వాత నిరంతరం ప్రాక్టిస్ చేసి, పీయూకు గోల్డ్‌మెడల్ తీసుకురావాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా గత సంవత్సరం విజ్జీ ట్రోఫీకి ఎంపికై న క్రీడాకారుడు డీవీడీ కృపను అభినందించారు. వీరికి ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి పోటీలకు సన్నద్ధ చేయాలని పీడీ శ్రీనివాస్‌కు సూచించారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులు తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొనున్నారు. కార్యక్రమంలో కంట్రోలర్ ప్రవీణ, పీడీ శ్రీనివాస్, ఎండీసీఏ సెక్రెటరీ రాజశేఖర్, ప్రెసిడెంట్ సురేశ్‌కుమార్ రెడ్డి, యుగేంధర్, రజిని, శ్వేత తదితరులు పాల్గొన్నారు.


