వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి
మహబూబ్‌నగర్ రూరల్: వృద్ధులు, దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఆమె వృద్ధులు, దివ్యాంగుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆ వెంటనే సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తూ పరిష్కారం చేయాలని ఆదేశించారు. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల కోసం వినతులు వచ్చాయి. దివ్యాంగులకు కమ్యూనిటీ భవనం ఏర్పాటుచేయాలని ఆ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జిల్లా సంక్షేమశాఖ అధికారి జరీనాబేగం గతంలో వచ్చిన ఫిర్యాదులను సమగ్రంగా కలెక్టర్‌కు వివరించారు. డీఆర్‌డీఓ నర్సింహులు, ఆర్డీఓ నవీన్, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు పాల్గొన్నారు.


