ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం: ఎస్పీ
రాజాపూర్: ప్రజల భద్రతే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ జానకి అన్నారు. బాలానగర్‌లో చేపట్టిన ఎన్‌హెచ్–44 ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను బుధవారం ఆమె పరిశీలించారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో హైవేపై వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని.. ఫ్లైఓవర్ బ్రిడ్జి పనుల వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసులు, నేషనల్ హైవే అధికారులకు ఎస్పీ సూచించారు. ముఖ్యంగా పనులు జరిగే ప్రాంతాల్లో సూచిక, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసి, వాహనాల రాకపోకలు సజవుగా సాగేలా చూడాలన్నారు. ఎస్పీ వెంట సీఐ నాగార్జునగౌడ్, ఎస్‌ఐలు లెనిన్‌గౌడ్, శివానందం ఉన్నారు.


