చదువుతో పాటు ఆటల్లో ప్రతిభ చాటాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభచాటాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రవీణ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్‌స్టేడియంలో రెండు రోజులపాటు జరిగే పీఎంశ్రీ జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ మంగళవారం ప్రారంభమైంది. కార్యక్రమంలో పాల్గొన్న డీఈఓ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో విజేతగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి పీఎంశ్రీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొంది ఢిల్లీస్థాయిలో పాల్గొని మన జిల్లాకు పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, క్రీడల ఇన్‌చార్జి వేణుగోపాల్, పీడీలు జగన్‌మోహన్‌గౌడ్, సాదత్‌ఖాన్, రాజవర్దన్‌రెడ్డి, వడెన్న, పరుశరాములు, రాంచందర్, ముస్తఫా, శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్, శంకర్, వినోద్, కృష్ణ, మొయిన్ తదితరులు పాల్గొన్నారు.
● పీఎంశ్రీ క్రీడల్లో భాగంగా కబడ్డీ, వాలీ బాల్ పోటీలు నిర్వహించారు. కబడ్డీ బాలుర విభా గంలో బాదేపల్లి (బాలుర) ప్రథమ, గార్లపాడ్ ద్వితీయ, బాలికల్లో టీజీఆర్‌ఎస్ బాలానగర్ ప్రథమ, వస్పుల ద్వితీయ, బాలుర విభాగం వాలీబాల్‌లో బాదేపల్లి (బాలుర) ప్రథమ, వేముల ద్వితీయ, బాలికల్లో బాలానగర్ ప్రథమ, చిన్నచింతకుంట ద్వితీయ స్థానాల్లో నిలిచారు. నేడు (బుధవారం) పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో భాగంగా ఖోఖో, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి.
కబడ్డీ ఆడుతున్న బాలికలు


