బైలెల్లిన మైసమ్మ బోనం
ఫత్తేపూర్ మైసమ్మ అడవి అమ్మవారి నామంతో మర్మోగింది. అమ్మా బైలెల్లినాది.. తల్లి మైసమ్మ బైలెల్లినాది అంటూ అమ్మవారి బోనాలను వైభవంగా నిర్వహించారు. మైసమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 116 బోనాలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పచ్చని అడవి మొత్తం భక్తులతో కిటకిలాడింది. మైసమ్మ ఆలయ ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆలయ అధికారి నర్సింహులు ప్రత్యేకంగా అలంకరించిన బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కాకర్లపహాడ్‌తోపాటు పరిసర గ్రామాల ప్రజలు ప్రత్యేకంగా అలంకరించిన ఎద్దుల బండ్లతో శకటోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో కాకర్లపహాడ్ సర్పంచ్ బాలయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తులసీ రాంనాయక్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాంచంద్రయ్య, నర్సింహులు, గోపాల్, కృష్ణయ్య, నరేందర్, మాధవులు, నారాయణరెడ్డి, ఖాజామైనోద్దిన్, బాలయ్య, శ్రీనివాస్, నర్సింహులు, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. – నవాబుపేట
బైలెల్లిన మైసమ్మ బోనం
బైలెల్లిన మైసమ్మ బోనం
బైలెల్లిన మైసమ్మ బోనం


