ఆద్యంతం.. ఉత్సాహభరితం
జ్ఞాపికలు.. సర్టిఫికెట్లు
చివరిరోజు తొమ్మిది వేదికల్లో విద్యావిషయకు అంశాలకు సంబంధించి మట్టితో బొమ్మలు, తెలుగు, ఇంగ్లిష్‌లో సీనియర్, జూనియర్ విభాగాల విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. జూనియర్లకు భారతదేశ పటంలో, సీనియర్లకు ప్రపంచ పటంలో ప్రాంతాలను గుర్తించే పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక విభాగంలో సీనియర్లకు జానపద, శాసీ్త్రయ నృత్యం, కోలాటం, సైన్స్ ఎగ్జిబిషన్, లఘునాటిక, దేశభక్తి గేయాల పోటీలు నిర్వహించి.. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి జ్ఞాపికలు, పోటీల్లో పాల్గొన్న వారందరికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి వీరాంజనేయులు, సలహాదారులు జగపతిరావు, లక్ష్మణ్‌గౌడ్, డాక్టర్ మహేష్‌బాబు, వీణశివకుమార్, ప్రమోద్‌కుమార్, వెంకటస్వామి, వేణుగోపాల్‌వర్మ, పులి జమున, ఇరువింటి వెంకటేశ్వరశర్మ, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ మహబూబ్‌నగర్: చిన్నారులకు ఆట విడుపుగా.. చూపరులకు కనులపండువగా రెండురోజులపాటు కొనసాగిన పిల్లలమర్రి బాలోత్సవం నాలుగో పిల్లల జాతర వారిలో మధురానుభూతుల్ని నింపింది. జిల్లాకేంద్రం సమీపంలోని ఓ గార్డెన్స్‌లో నిర్వహించిన పిల్లలమర్రి బాలోత్సవం మంగళవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమంలో పాల్గొన్న పీయూ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లల్లో నైపుణ్యాల్ని వెలికితీసేందుకు ఇలాంటి బాలోత్సవాలు ఉత్తమ వేదిక అన్నారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించే చక్కటి వేదికను కల్పించిన బాలోత్సవ కమిటీ కృషిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆర్.శశిధర్ కొనియాడారు. పిల్లలమర్రి బాలోత్సవ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బెక్కెం జనార్దన్, డాక్టర్ ప్రతిభ మాట్లాడుతూ మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో చక్కని ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి వేదికను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పిల్లల్లో ఆరోగ్యకరమైన పోటీ, సృజనాత్మకత, అంతర్గత నైపుణ్యాలను వెలికితీసేలా విద్యా విషయక, సాంస్కృతిక విభాగాలకు సంబంధించి దాదాపు 35 అంశాలకు పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు.
ముగిసిన పిల్లలమర్రి 4వ బాలోత్సవం
ఆద్యంతం.. ఉత్సాహభరితం


