హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయొద్దు
మహబూబ్‌నగర్ క్రైం: ప్రయాణికులను తరలించే ప్రతిక్యాబ్, ఆటో డ్రైవర్లు అత్యంత సురక్షితమైన డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందని, వారి చేతుల్లో అనేకమంది ప్రాణాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా టూటౌన్ పోలీస్‌స్టేషన్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని అర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో క్యాబ్, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగహన సదస్సుతోపాటు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై వాహనాలు నడిపే వారిలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు ఇతర వాహనదారులు తప్పక సీటు బెల్ట్ ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, రాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్, న్యాయవాదులు పాల్గొన్నారు.
ప్రతిబంక్‌లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
● మహబూబ్‌నగర్ నగరం పరిధిలో ఉన్న అన్నిరకాల పెట్రోల్ బంకుల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ సీఐ భగవంత్‌రెడ్డి సూచించారు. మంగళవారం పెట్రోల్ బంకుల యాజమానులతో ట్రాఫిక్ సీఐ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకుండా వచ్చిన వాహనదారులకు వాహనాల్లో పెట్రోల్ పోయరాదని సూచించారు. హెల్మెట్ ధరించడంతో ప్రాణరక్షణ సాధ్యమవుతుందని, తలకు జరిగే గాయాలతో అధికంగా ప్రాణాలు పోతున్నాయని హెల్మెట్ ఉంటే మృతుల సంఖ్య తగ్గుతుందన్నారు.‘ నో హెల్మెట్–నో ఫ్యూయల్’ నినాదంతో అన్ని పెట్రోల్ బంకుల్లో స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేసి ఇకపై హెల్మెట్ లేకుండా వచ్చిన ఎవరికై నా పెట్రోల్ పోయరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి ఇందిర


