చిన్నారిపై పిచ్చికుక్క దాడి | - | Sakshi
Sakshi News home page

చిన్నారిపై పిచ్చికుక్క దాడి

Jan 1 2026 11:09 AM | Updated on Jan 1 2026 11:09 AM

చిన్న

చిన్నారిపై పిచ్చికుక్క దాడి

ఊట్కూరు: ఇంటి ఆవర ణలో ఆడుకుంటున్న నా లుగేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసిన ఘటన పట్టణంలో బుధవారం జ రిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని గాంధీనగర్‌ వీధిలో నివాసం ఉంటున్న చాకలి రాజు, అనితల కుమార్తె అక్షిత ఇంటి బయట ఆడుకుంటుండగా ఒక్కసారిగా పిచ్చికుక్క దాడి చేసింది. దాడిలో బాలిక ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడద అధికంగా ఉందని పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకొని కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఉరేసుకొని వ్యక్తి మృతి

అచ్చంపేట రూరల్‌: పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో ఓ వ్యక్తి ఇంటిలో ఉరేసుకొని మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సద్దాంహుస్సేన్‌ తెలిపిన వివరాల ప్రకారం కాలనీకి చెందిన మందుల బాలస్వామి(40) కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. తాగుడుకు బానిసైన తరుచుగా భార్య స్వాతి తో గొడవ పడుతుండేవాడు. తాగేందుకు డ బ్బులు లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు.

ఇసుక డంపులు సీజ్‌

ఉప్పునుంతల: మండలంలోని పెద్దాపూర్‌ శివారు దుందుబీ వాగు పరిసర ప్రాంతంలో అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంపులను బుధవారం తహసీల్దార్‌ సునీత పరిశీలించి సీజ్‌ చేశారు. పదిచోట్ల దాదాపుగా 350 ట్రిప్పుల(ట్రాక్టర్‌) ఇసుక అక్రమంగా నిల్వ చేశారని తహసీల్దార్‌ తెలిపారు. సీజ్‌చేసిన ఇసుక డంపులను సంబంధిత పెద్దాపూర్‌ జీపీఓ అంజనేయులకు అప్పగించారు. దుందుబీ వాగు నుంచి అనుమతిలేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హెచ్చరించారు. ఎమ్మారై రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు.

అడవుల సంరక్షణ

అందరి బాధ్యత

అమ్రాబాద్‌: అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని ఎఫ్‌డీఓ రామ్మూర్తి అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం అమ్రాబాద్‌లో అడవుల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ మనుగడకు అడవులు ఎంతో ముఖ్యమని, వాటిని నాశనం చేస్తే జీవ వైవిద్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొన్ని చోట్ల అడవులను నరకడం, వన్యప్రాణుల వేటాడుతున్నారని.. అలాంటి వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ వీరేష్‌, సెక్షన్‌ అధికారిణి భాగ్య, ఎఫ్‌బీఓ నాగేష్‌ తదితరులు ఉన్నారు.

చికిత్స పొందుతూ

వివాహిత మృతి

మానవపాడు: కాలిన గాయాలతో చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన ఘటన మండలంలోని జల్లాపురంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ స్వాతి వివరాల మేరకు.. మానవపాడు మండలంలోని జల్లాపురం గ్రామానికి చెందిన సుకన్య (27) డిసెంబర్‌ 27న సాయంత్రం ఇంట్లో వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకుంది. దీంతో కుటుంబ సభ్యులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

చిన్నారిపై పిచ్చికుక్క దాడి 
1
1/2

చిన్నారిపై పిచ్చికుక్క దాడి

చిన్నారిపై పిచ్చికుక్క దాడి 
2
2/2

చిన్నారిపై పిచ్చికుక్క దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement