చోరీలపై దృష్టి ఏది?
● మహబూబ్‌నగర్ లక్ష్మీనగర్ కాలనీలో వరస దొంగతనాలు
● నాలుగు రోజుల కిందట భారీ
మొత్తంలో అపహరించిన దొంగల ముఠా
● కోల్పోతున్న మొత్తాన్ని ఎఫ్‌ఐఆర్‌లో చూపడం లేదని పోలీసులపై విమర్శలు
మహబూబ్‌నగర్ క్రైం: ఇటీవల కాలంలో రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విచ్చలవిడిగా దొంగతనా లు పెరిగిపోయాయి. రెండు మూడు రోజులకు ఓ సారి ఏదో ఏరియాలో చోరీల పరంపర సాగుతుంది. ప్రధానంగా లక్ష్మీనగర్ కాలనీలో వరస దొంగతనాలతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం మీనాక్షి అపార్ట్‌మెంట్‌లో ఓ ప్లాట్‌లో భారీగా దొంగతనం జరిగినట్లు సమాచారం. 20 తులాల వరకు బంగారం, వెండి, అధి క మొత్తంలో డబ్బు అపహరించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి పోలీసు బృందం అపార్ట్‌మెంట్ దగ్గర వివరాలు సేకరించినట్లు సమాచారం. సదరు దొంగల ముఠా అర్ధరాత్రి వేళలో కాలనీలో తిరిగిన దృశ్యాలు స్థానికంగా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే ప్రధానంగా రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అధిక మొత్తంలో కొత్త కాలనీలు ఉండటం వల్ల రాత్రి పెట్రోలింగ్ నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. దీంతో తాళాలు వేసి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. అఽ దిక మొత్తంలో దొంగతనాలు జరుగుతున్న మరోవైపు పోలీస్ అధికారులు మాత్రం వారు చూపించే అధికారిక లెక్కల్లో చాలా తక్కువగా చూపడం హాస్యస్పదంగా ఉంది. దీంతో పాటు దొంగతనం జరిగిన సమయంలో బాధితులు కోల్పోయిన బంగారం లేదా వెండి, డబ్బులలో కనీసం 40శాతం కూడా ఎఫ్‌ఐఆర్‌లలో చూపడం లేదనే విమర్శలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఈ దొంగతనం విషయంపై రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.


