ట్రాన్స్‌జెండర్లకు వందశాతం సబ్సిడీ రుణాలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని ట్రాన్స్‌జెండర్‌లకు వందశాతం సబ్సిడీతో ఆర్థిక పునరావాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిణి జరీనాబేగం బుధవారం ప్రకనటలో తెలిపారు. అర్హులైన ముగ్గురు ట్రాన్స్‌జెండర్స్‌కు ఒక్కొకరికి రూ.75వేల చొప్పున మొత్తం 1యూనిట్‌కు రూ.75వేలు వందశాతం సబ్సిడీ కింద జిల్లాకు కేటాయించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా మేజిస్ట్రేట్ జారీచేసిన గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని, 18 నుంచి 55ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలని పేర్కొన్నారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు ఆదాయం మించొద్దని తెలిపారు. నమూనా దరఖాస్తులను, అర్హత ప్రమాణాలను జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో పొంది ఈనెల 9వ తేదీలోగా జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ సంక్షేమాధికారిణి కార్యాలయం, కలెక్టరేట్‌లో అందజేయాలని ఆమె కోరారు.
కురుమూర్తి ఆలయం చుట్ట్టూ గిరి ప్రదక్షిణ
చిన్నచింతకుంట: చిన్నచింతకుంట మండలం అమ్మాపురుం కురుమూర్తి స్వా మి ఆలయ గిరులలో బుధవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గిరి ప్ర దక్షిణ నిర్వహించారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్దియాదిరెడ్డి, అమ్మాపు రం సంస్థానాదీశీలు రాజ శ్రీరాంభూపాల్, కురుమూర్తి స్వామి ఆలయ మా జీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వందంలాది మంది భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి ఆలయ రాజగోపురం వద్ద ప్రదక్షిణను ప్రారంభించి స్వామివారి ప్రధాన ఆలయం సమీపం నుంచి కురుమూర్తి గుట్టల వెన క భాగాన అమ్మాపురం సమీపంలోని ఆత్మకూర్, దేవరకద్ర పట్టణాల ప్ర ధా న రోడ్డుగుండా రాజగోపురం వరకు 4 కిలోమీటర్లు ప్రదక్షిణ కొనసాగింది.
మొక్కజొన్న లారీల పట్టివేత
చిన్నచింతకుంట: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి రాష్ట్రంలోని నారాయణపేటకు అక్రమంగా మొక్కజొన్న తరలిస్తున్న లారీలను పట్టుకొని దేవరకద్ర మార్కెట్‌కు తరలించడంతో పాటు లారీల యజమానులకు జరిమానా విధించినట్లు ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి మండలంలోని లాల్‌కోట చౌరస్తాలో వాహన తనిఖీలు చేపడుతుండగా.. రెండు లారీల్లో మొక్కజొన్న అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించకుండా తరలిస్తున్నట్లు తమ విచారణలో బయటపడిందని చెప్పారు. ఒక్కో లారీలో 30 టన్నుల మొక్కజొన్న ఉందని.. మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు లారీలకు రూ.17 వేల జరిమానా విధించారని, చెల్లించిన అనంతరం లారీలను డ్రైవర్లకు అప్పగించినట్లు ఎస్‌ఐ వివరించారు.
దివ్యాంగులను వివాహం చేసుకుంటే ప్రోత్సాహకం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్):దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే రాష్ట్ర ప్రభు త్వం రూ.లక్ష ప్రోత్సాహక బహుమతి అందజేయనున్నట్లు, ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వయోవృద్ధు సంక్షేమ శాఖ సంక్షేమ అధికా రి జరీనా బేగం బుధవాం ప్రకటనలో పేర్కొన్నారు. లక్ష వివాహ ప్రోత్సాహక బహుమతిని దివ్యాంగులు, దివ్యాంగులను విహహం చేసుకు న్నా.. ఈ బహుమతి వర్తిస్తుందని తెలిపారు. దివ్యాంగులు, సకలాంగులను వివాహం చేసుకొన్న మే 19 2025 తర్వాత దివ్యాంగులు, దివ్యాంగులను వివాహం చేసుకొన్న దంపతులు www.e pa-r-r.-te a nfa na. gov.in అనే వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొని, సంబంధిత సమగ్ర శిశు అభివృద్ధి ఆధికారి కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను సమర్పించి సద్వినియోగం చేసుకోగలరని కోరారు.


