టీ–20 లీగ్‌లో డేవిడ్ సెంచరి
10 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై మహబూబ్‌నగర్ విజయం
మహబూబ్‌నగర్ జట్టుతో ఎండీసీఏ ప్రతినిధులు
మహబూబ్‌నగర్ క్రీడలు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ రెండో ఫేజ్‌లో మహబూబ్‌నగర్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 10 వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. జట్టులో వాసుదేవ్ 58 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. వి.వినీత్ 24 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లు మహ్మద్ షాదాబ్ అహ్మద్ 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు, మహ్మద్ ముఖితుద్దీన్ 4 ఓవర్లలో 18 పరుగులు, రాకేష్‌నాయక్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి చెరో వికెట్ తీశారు. అనంతరం బరిలోకి దిగిన మహబూబ్‌నగర్ జట్టు నిర్ణీత 17 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 158 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ డేవిడ్ క్రిపాల్‌రాయ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అజేయంగా సెంచరీ చేశారు. కేవలం 60 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 103 పరుగులు, అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా 43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డేవిడ్ క్రిపాల్‌రాయ్‌కు దక్కగా రూ.5 వేల నగదు, మెమోంటో అందుకున్నారు. ఈ నెల 3న మహబూబ్‌నగర్ జట్టు ఖమ్మం జట్టుతో తలపడనుంది.
● ఎండీసీఏ అభినందనలు..
టీ–20 లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధానకార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో లీగ్‌లో సత్తాచాటి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. మ్యాచ్‌లో మెరుగైన ప్రతిభ కనబర్చినందుకు ప్రోత్సాహకంగా ఎండీసీఏ తరఫున డేవిడ్ క్రిపాల్‌రాయ్‌కు రూ.5 వేలు, అబ్దుల్ రాఫేకు రూ.2,500 నగదు అందజేశారు. సంఘం ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, శివశంకర్, నరేష్ క్రీడాకారులను అభినందించారు.
టీ–20 లీగ్‌లో డేవిడ్ సెంచరి


