పరవశించిన పాలమూరు
మెగా రక్తదాన శిబిరం..
అయ్యప్పకొండపై వైభవంగా మహా పడిపూజ
స్వామివారికి విశేష పూజలు..
● ప్రధాన రహదారులపై ఊరేగిన హరిహరసుతుడు
● మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
● హాజరైన ప్రముఖులు
పూజల్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మెట్లపూజలో పాల్గొన్న మహిళా భక్తులు
మహిళలతో కలిసి కోలాటం ఆడుతున్న ఎంపీ డీకే అరుణ
స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు పద్మావతీకాలనీలో ఉన్న అయ్యప్పకొండపై గురువారం అయ్య ప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం తూర్పుకమాన్ రామాలయం నుంచి అయ్యప్ప పల్లకీతో పాటు రథం, పూర్ణ కలశం, స్వామివారి ఆభరణాల శోభాయాత్ర ప్రారంభమై గడియారం చౌరస్తా, అశోక్‌టాకీస్ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా, న్యూటౌన్, మెట్టుగడ్డ, పద్మావతికాలనీ మీదుగా ఆలయానికి చేరుకుంది. శోభాయాత్రలో అయ్యప్ప మాలధారులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. పట్టణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. ఊరేగింపులో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొని పూజలు చేశారు.
ఊరేగింపు అనంతరం అయ్యప్ప ఆలయంలో స్వామివారికి అష్టాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. ఉదయం గణపతి, నవగ్రహ హోమాలు, నిత్యాభిషేకం, సహస్ర నామార్చన చేశారు. రాత్రి తిరుపతికి చెందిన వెంకటేశ్వర చంద్రమౌళిశర్మ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామికి చందనం, పంచామృతాలతో అభిషేకాలు, ఏకశిల దివ్య పదునెట్టాంబడి పూజ, మహా మంగళహారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు సీఆర్ భగవంతరావు, ప్రధానకార్యదర్శి ముత్యంస్వామి, పంబరాజు, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పడిపూజ సందర్భంగా అయ్యప్పకొండపై మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి శిబిరాన్ని ప్రారంభించగా 504 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ లయన్ నటరాజ్, డా. హిమబిందు, డా. అంజన్నరాజు, డా. శ్రీకర్, మధుసూదన్‌రెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరవశించిన పాలమూరు
పరవశించిన పాలమూరు


