యువకుడి ఆత్మహత్య
ధన్వాడ: భార్యతో గొడవ పడిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ధన్వాడలో చోటుచేసుకుంది. పో లీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని అప్పాజీ నగర్‌కు చెందిన భాస్కర్(24) భార్యాభర్తల మధ్య న తరచుగా గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో మరోసారి రాత్రి ఇద్దరి మధ్యన గొడ వ చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో విసిగిపోయిన భాస్కర్ తెల్లవారుజమున ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.
రైలు కిందపడి వ్యక్తి
బలవన్మరణం
మక్తల్: గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని జక్లేర్ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జక్లేర్‌కు చెందిన కుర్వ మల్లేష్ (38)కు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడప్పుడు చెప్పేవాడన్నారు. ఈ క్రమంలోనే గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కొందరు కుటుంబ సభ్యులకు, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
బిజినేపల్లి: మండలంలోని గంగారం, లట్టుపల్లి గ్రామాల శివారులో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న శంకర్‌నాయక్(50) బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌నాయక్ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో గంగారం నుంచి తన స్వగ్రామం అయిన ఉడుగులకుంట తండాకు బయలుదేరాడు. గురువారం తెల్లవారుజామున ఇప్పలతండా సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైనట్లు అటుగా ప్రయాణించే వాహనదారులు గుర్తించారు. వారు కొన ప్రాణంతో ఉన్న శంకర్‌నాయక్ నీళ్లు తాపి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసేలోపు మరణించాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
మదనాపురం: కుటుంబంలో ఏర్పడిన కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అజ్జకొల్లులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంకరి అంజలి (సహస్ర) (24)కు భర్తతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోని బాత్రూమ్‌లోకి వెళ్లి టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి కిష్టయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి కుమారుడు ఉన్నాడు.
యువకుడి ఆత్మహత్య
యువకుడి ఆత్మహత్య


