పాలమూరుకు రెండో విజయం
● సత్తాచాటిన గద్వాల, నాగర్‌కర్నూల్ జట్లు
కొనసాగుతున్న తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ కొనసాగుతోంది. గురువారం నాలుగోరోజు ఆతిథ్య మహబూబ్‌నగర్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గద్వాల క్రీడాకారుడు సుజల్‌రెడ్డి లీగ్‌లోనే మొదటి సెంచరీ నమోదు చేశారు.
● 46 పరుగుల తేడాతో..
గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 46 పరుగుల తేడాతో జోగుళాంబ గద్వాల జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 16 ఓ వర్లలో 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. జట్టులో డేవిడ్ క్రిపాల్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81 పరుగులు చేయగా, శ్రీకాంత్ 22 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 పరుగులు, అబ్దుల్ రాఫే 29 పరుగులు చేశారు. గద్వాల బౌలర్లు ఖయ్యూం ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గద్వాల జట్టు 15.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఎస్.అరవింద్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48 పరుగులు, మహ్మద్ ఖయ్యూం 28 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లు వెంకటచంద్ర 2, ముఖితుద్దీన్ 2, శశాంక్ 2, షాదాబ్ అహ్మద్ 2 వికెట్లు, కొండ శ్రీకాంత్, యువన్ చెరో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డేవిడ్ క్రిపాల్ (మహబూబ్‌నగర్)కు దక్కింది.
● 9 వికెట్ల తేడాతో నాగర్‌కర్నూల్ విజయం..
మరో లీగ్‌మ్యాచ్‌లో నాగర్‌కర్నూల్ జట్టు 9 వికెట్ల తేడాతో వనపర్తి జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వనపర్తి జట్టు నాగర్‌కర్నూల్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పో యింది. నిర్ణీత 16 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. జట్టులో యశ్వంత్ 13, నవీనకుమార్ 13 పరుగులు చేశారు. నాగర్‌కర్నూల్ బౌలర్లు రాంచరణ్ 4 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు, జష్షు 3 ఓవర్లలో 4 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నాగర్‌కర్నూల్ జట్టు సునాయసంగా ఆడి లక్ష్యాన్ని ఛేదించింది. 6.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి 69 పరుగులు చేసింది. జట్టులో బి.సంజయ్ 23 బంతుల్లో 9 ఫోర్లతో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మ్యాన్ ఆప్ ది మ్యాచ్‌గా రాంచరణ్ (నాగర్‌కర్నూల్) నిలిచారు.
● 82 పరుగుల తేడాతో గద్వాల విజయం..
మరో లీగ్ మ్యాచ్‌లో జోగుళాంబ గద్వాల జట్టు 82 పరుగుల తేడాతో వనపర్తి జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గద్వాల జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ సుజల్‌రెడ్డి 48 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మహ్మ ద్ ఖయ్యూం 38, యూనుస్ 37 పరుగులు చేశా రు. వనపర్తి బౌలర్ యశ్వంత్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వనపర్తి జట్టు 16 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. జట్టులో రాంచారి 38, గణేష్‌రెడ్డి 21 పరుగులు చేశారు. గద్వాల బౌలర్లు ఖ య్యూం 2, వెంకటసాగర్ 2 వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా సుజల్‌రెడ్డి (గద్వాల) నిలిచారు.
● చక్కటి ప్రతిభ చాటాలి..
క్రికెట్ లీగ్‌లను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని చక్కటి ప్రతిభ కనబర్చాలని పుర కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మ్యాన్ ఆప్ ది మ్యాచ్‌గా నిలిచిన క్రీడాకారుడికి ఎండీసీఏ ప్రతినిధులతో కలిసి రూ.2 వేల నగదు, మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరాజు, ఎండీసీఏ ప్రధానకార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్‌అలీ, సభ్యులు శివశంకర్ పాల్గొన్నారు.
పాలమూరుకు రెండో విజయం


