విద్యుత్‌షాక్‌తో కాంట్రాక్టు సిబ్బందికి గాయాలు
కొత్తకోట: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి గాయాలపాలైన ఘటన కొత్తకోట పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. మదనాపురం మండలం దంతనూర్‌కు చెందిన యాదగిరి కొత్తకోట మండలంలోని విద్యుత్ శాఖలో కాంట్రాక్టు సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం కొత్తకోట పట్టణంలోని ఓ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా.. ముందస్తు హెచ్చరికలు లేకుండానే విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. ఈ సందర్భంలో యాదగిరి అకస్మాత్తుగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్‌లోని న్యూరో ఆస్పత్రికి తరలించినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. విద్యుత్‌శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. గుర్తింపు పొందిన విద్యుత్‌శాఖ లైన్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో ఉండి పనులు చేయాల్సి ఉండగా బినామీ కాంట్రాక్టర్‌గా మారుతున్నారు. కిందిస్థాయి కాంట్రాక్టు సిబ్బందికి బాధ్యతలు అప్పగించడమే ప్రమాదానికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఘటనపై భద్రతా నిర్లక్ష్యం కార్యాచరణలో వైఫల్యం కోణాల్లో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సహచర ఉద్యోగులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యుత్‌షాక్‌తో కాంట్రాక్టు సిబ్బందికి గాయాలు


