మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం
● గర్భం దాల్చడంతో వెలుగులోకి
ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు
భూత్పూర్: మానసిక దివ్యాంగురాలిపై ఇద్ద రు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడగా గ ర్భం దాల్చిన ఘటన వెలుగుచూసింది. ఎస్ ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. భూత్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురా లు(35) అవావిహిత. ఈమె ఇంటి వెనకాల ఉండే పరమేష్, పిండి శేఖర్ కొన్ని నెలలుగా ఆమెతో శారీరక సంబంధం ఏర్పరుచుకు న్నారు. కాగా.. ఇటీవల సదరు మహిళకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె తండ్రి జిల్లాకేంద్రంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఐదు నెలల గర్భిణి అని నిర్ధారించారు. ఈ ఘటనపై గ్రామపెద్దలు జోక్యం చేసుకుని పుట్టిన బిడ్డ పేరు మీద రూ.9 లక్షలు బ్యాంకులో జమ చేయడానికి నిర్ణయించారు. అ యితే ఈ విషయం చివరికి బయటపడటంతో బాధితురాలి తండ్రి గురువారం భూ త్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరమేష్, పిండి శేఖర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
ఊట్కూరు: త్రుటిలో ఘోర బస్సు ప్రమాదం తప్పిన ఘటన గురువారం మండలంలోని కొల్లూరు స్టేజి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మక్తల్ నుంచి పల్లె వెలుగు బస్సు నారాయణపేటకు వెళ్తుండగా మండలంలోని కొల్లూరు గేటు సమీపంలో బస్సు కమాన్ పట్టీలు విరిగిపోయాయి. దీంతో డ్రైవర్ కాలప్ప అప్రమత్తతతో బస్సు ఆపేందుకు ప్రయత్నించగా రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉండగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కాలం చెల్లిన బస్సుల వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


