దేవరకద్ర పట్టణంలో ఇలా..
ఇదిలా ఉండగా గత జనవరి 27న కొత్తగా ఏర్పడిన దేవరకద్ర మున్సిపాలిటీలో మొత్తం ఐదు గ్రామపంచాయతీలు విలీనమయ్యాయి. అప్‌గ్రేడ్ అయినప్పటికీ భువన్ యాప్ అమలులోకి రాకపోవడంతో కేవలం ఇళ్లు ఉన్నట్లుగా అధికారులు లెక్క గట్టి గ్రామపంచాయతీ ఉన్నప్పటి ఆస్తి పన్నుతోనే సరిపెడుతున్నారు. కేటగిరీల వారీగా వాణిజ్య–వ్యాపార సముదాయాలు, మిక్స్‌డ్, ప్రభుత్వ భవనాలు ఎన్ని ఉ న్నాయన్నది ఇంకా తేల్చలేకపోయారు. దీంతో ఆస్తిపన్నుకు సంబంధించి భారీగా గండిపడింది. దేవరకద్రలో మొత్తం 3,431 మంది అసెస్‌మెంట్ దారులకు గాను ఈ ఏడాది (2025– 26) రూ.29,17,000, అలాగే పాత బకాయిల కింద రూ.20,53,000 కలుపుకొని రూ. 49,70,000 రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు ఈ ఏడాదికి సంబంధించి రూ. 16,63,000, అలాగే పాత బకాయిల కింద రూ.10,73,000 ఇలా 1,641 మంది నుంచి మొత్తం రూ.27,36,000 (55.04 శాతం) వసూలు చేశారు. ఇంకా 1,790 మంది నుంచి ఈ ఏడాదికి సంబంధించి రూ.11,91,000, అలాగే పాత బకాయిల కింద రూ.9,80,000 ఇలా మొత్తం రూ.21,71,000 రావాల్సి ఉంది.
ఆస్తిపన్ను వసూలుకు ప్రత్యేక బృందాలు
నగరంలో ఆస్తిపన్ను బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయింది వాస్తవమే. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలల గడువు ఉంది. ఆస్తిపన్ను వసూలు వేగవంతం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరిగి వీలైనంత ఎక్కువ మంది నుంచి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ముఖ్యంగా పాత బకాయిదారులకు నోటీసులు అందజేసి రాబట్టాలని సూచించాం.
– టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్‌నగర్
●


