ఆస్తిపన్ను వసూళ్లలోవెనుకంజ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని పాలమూరు నగరంతో పాటు జడ్చర్ల, భూత్పూర్ పట్టణాలలో ఆస్తిపన్ను వసూలు చేయడంలో మున్సిప ల్ అధికారులు వెనుకబడ్డారు. కేవలం కొత్త మున్సిపాలిటీ దేవరకద్రలో మాత్రమే లక్ష్యంలో సగాన్ని అధిగమించగలిగారు. ఈ ఆర్థిక సంవత్సర (2025 –26)లో ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచిపోయింది. ఇక మిగిలింది మూడు నెలల గడువు మాత్రమే మిగిలింది. మరోవైపు అర్బన్ డే పేరిట ఉన్నతాధికారులు నెలలో కనీసం రెండుసార్లయినా ఆయా విభాగాల అధికారులతో సమీక్షిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. దీంతో ఏటేటా మొండి బకాయిలు పేరుకుపోతూనే ఉన్నాయి. ఇక ఆర్థిక సంవత్సరం చివర్లో ఆస్తిపన్ను చెల్లిస్తే సరిపోతుందిలే.. అని అసెస్‌మెంట్‌దారులు చెబుతుండ టం గమనార్హం. వాస్తవానికి ఏడాదిలో రెండుసార్లు ఇంటింటికీ మున్సిపల్ సిబ్బంది వెళ్లి వీరికి డిమాండ్ నోటీసులను ఇస్తున్నా చలనం లేదు.
9 నెలల్లో పాలమూరు కార్పొరేషన్ పరిధిలో 24.23 శాతమే!
జడ్చర్లలో 30.94, భూత్పూర్‌లో 33.79 శాతం మాత్రమే
కొత్త మున్సిపాలిటీ దేవరకద్రలో 55.04 శాతం వసూలు
తరచూ సమీక్షలతోనే సరిపెడుతున్నఉన్నతాధికారులు
పట్టణాల్లో ఏటేటా పేరుకుపోతున్న మొండి బకాయిలు


