ఎంబీ చర్చికి ఘనమైన చరిత్ర
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలో ఎంబీ చర్చి (కల్వరి మెన్నోనైట్ బ్రదరన్ చర్చి)కి ఘనమైన చరిత్ర ఉంది. మహబూబ్‌నగర్ నడిబొడ్డున ఈ చర్చి నిర్మాణమై 1957 నుంచి క్రైస్తవులకు ప్రధాన ప్రార్థన మందిరంగా మారింది. ఉమ్మడి జిల్లాలోనే పెద్ద చర్చిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రిస్మస్, గుడ్‌ఫ్రైడే, ఈస్టర్, కృతజ్ఞత తర్పణ పండుగలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది సీ్త్రల సమాజం, యువత తదితర సమావేశాలు జరుగుతాయి. ఎంబీ చర్చి ఎదుట విశాలమైన ప్రాంగణం అందుబాటులో ఉంది. ఆయా పండుగ రోజుల్లో చర్చి లోపల, ప్రాంగణంలో ఒకేసారి 5వేలకుపైగా క్రైస్తవులు ప్రార్థనలు చేస్తారు.
43 ఏళ్ల నుంచి పాస్టర్‌గా పనిచేస్తున్న
43 ఏళ్ల నుంచి ఎంబీ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న. ఆ ఏసు ప్రభువు దయవల్లే నాకు ఇన్నేళ్లు నుంచి చర్చి పాస్టర్‌గా ఉన్న. ఎంబీ చర్చి మేనేజింగ్ కమిటీకి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నాను. ఈ చర్చి ఆధ్వర్యంలో 11 చర్చిల నిర్వహణ చేపడుతున్నాం. ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 మంది పాస్టర్లకు నెలసరి సహాయం అందజేస్తున్నాం. వితంతువులకు కూడా నెలసరి ఆర్థికసాయం ఇస్తున్నాం.
– రెవరెండ్ ఎస్.వరప్రసాద్, ఎంబీ చర్చి, సీనియర్ పాస్టర్
68 ఏళ్ల నుంచి చర్చిలో ప్రార్థనలు
ఒకేసారి 5 వేలకు పైగా ప్రార్థనలు చేసుకునే అవకాశం
ఉమ్మడి జిల్లాలోనే పెద్దచర్చిగా ప్రత్యేక గుర్తింపు
ఎంబీ చర్చికి ఘనమైన చరిత్ర


