ఎస్‌జీఎఫ్ జాతీయ పోటీలకు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: ఢిల్లీలో వచ్చేనెలలో జరిగే అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ కరాటే పోటీలకు జిల్లా క్రీడాకారిణి మహిమాన్విత ఎంపికై నట్లు జీకే మాస్టర్ షోటోకాన్ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ కరాటే మాస్టర్ శివకుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మహిమాన్విత ములుగు జిల్లా కేంద్రంలో ఈనెల 22, 23 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–19 ఎస్‌జీఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. కుమితె –48 కేజీల విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. క్రీడాకారిణిని జీకే మాస్టర్ షోటోకాన్ కరాటేడూ ఇండియా ఫౌండర్ చీఫ్ జి.కృష్ణయ్య, ఎగ్జామినర్ రవికుమార్, కరాటే మాస్టర్లు శివకుమార్, దామోదర్ అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో పతకం సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.


