రూ.1.50కోట్ల విలువైన మత్తుపదార్థాల దహనం
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ శాఖ గతేడాదిలో సీజ్ చేసిన మత్తు పదార్థాల ను డ్రగ్ డిస్పోజల్ కమిటీ సూచన మేరకు మంగళవారం డీసీ విజయ్ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లోని ఓ కంపెనీలోని బాయిలర్ మిషన్‌లో వేసి కాల్చివేశారు. ఉమ్మడి జిల్లాలో ని అన్ని ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్లలో పట్టుబడిన రూ.1.50కోట్ల విలువ చేసే నార్కోటిక్ మత్తు పదార్థాలైన 3.5కేజీల ఎండు గంజాయి, 13.5 కేజీల అల్పాజోలం, 5.8కేజీల డైజోఫాంను దహనం చేశారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఈఎస్ సుధాకర్, అసిస్టెంట్ ఎకై ్సజ్ అధి కారి నర్సింహారెడ్డి, సీఐ వీరారెడ్డి పాల్గొన్నారు.
కట్ట నిర్మాణానికి మట్టి నమూనాల సేకరణ
బల్మూర్: మండల కేంద్రం సమీపంలోని ఉమామహేశ్వర రిజర్వాయర్ కట్ట నిర్మాణం కోసం మంగళవారం తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబోరేటరి(టీఎస్‌ఈఆర్‌ఎల్) సంస్థ ఈఈ లక్ష్మయ్య ఆధ్వర్యంలో మట్టి నమూనాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ (బండు) కట్ట నిర్మించే బల్మూర్ ఊరచెరువు, మైలారం గుట్ట తదితర చోట్ల రెండు మీటర్ల లోతులో మట్టిని తవ్వి నమూనాలు సేకరించినట్లు ఈఈ తెలిపారు. పరీక్షల అనంతరం ఫలితాలు ఇరిగేషన్ శాఖకు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈలు సుధామాధురి, మాధవి, జేఈలు శ్రీనివాస్‌నాయక్, ప్రవీణ్, ఇరిగేషన్ డీఈ బాలస్వామి, ఏఈలు రమేష్, ప్రవీణ్‌కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
భారీగా పోలీసు బందోబస్తు..
మట్టి నమూనాల సేకరణకు అధికారులు రావడంతో భూ నిర్వాసితులు అడ్డు కొనే అవకాశం ఉందనే సమాచారం మేరకు ముందు జాగ్రత్తగా అచ్చంపేట సీ ఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పొలాలకు వెళ్లే రైతులనుఽ అధికారుల వద్దకు వెళ్లకుండా నిఘా ఉంచారు.
రూ.1.50కోట్ల విలువైన మత్తుపదార్థాల దహనం


