నలుగురు పోలీస్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా పోలీస్ శాఖకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు సకాలంలో సీసీటీఎన్‌ఎస్‌లో అప్‌డేట్ చేయడంతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐటీ సెల్ కో–ఆర్డినేటర్లు, ఐటీకోర్ టీం, టెక్‌టీం సిబ్బందిని మంగళవారం హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయంలో 171మందికి రివార్డ్ మేళా నిర్వహించి అభినందించారు. జిల్లా నుంచి ఐటీసెల్ కో–ఆర్డినేటర్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వర్‌రెడ్డి, ఐటీకోర్ టీం సభ్యుడు హెడ్‌కానిస్టేబుల్ విజయ్‌కుమార్, టెక్‌టీం సిబ్బందిలో బాలానగర్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాసులు, హన్వాడ స్టేషన్‌కు చెందిన యాదమ్మకు ప్రశంసా పత్రాలను అదనపు డీజీ శ్రీనివాసరావు అందజేశారు. జిల్లా నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్న నలుగురు సిబ్బందిని ఎస్పీ డి.జానకి అభినందించారు.
శ్రీనివాసులు
యాదమ్మ
విజయ్‌కుమార్
రాజేశ్వర్‌రెడ్డి
నలుగురు పోలీస్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు
నలుగురు పోలీస్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు
నలుగురు పోలీస్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు


