మూడు నెలలు నిల్వ..
మత్స్య కళాశాల విద్యార్థులు తయారు చేసే జల పుష్పాల పచ్చళ్లు గరిష్టంగా మూడు నెలలపాటు నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 90 రోజుల పాటు పచ్చడి నిల్వ ఉండేందుకు నిమ్మ రసాన్ని ఉపయోగించడంతోపాటు స్టెరిలైజ్ చేసిన గాజు సీసాలో నింపి లేబుల్ చేస్తారు. నాణ్యమైన నూనె, దినుసులను ఉపయోగిస్తారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. ఈ చేప, రొయ్యల పచ్చళ్లను తయారు చేస్తున్నట్లు మత్స్య కళాశాల నుంచి అధికారిక అనుమతులు పొంది పచ్చళ్లు తయారు చేస్తున్నారు.


