రేపు ఉమ్మడి జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ స్టేడియంలో ఈనెల 24న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–17, అండర్–19 విభాగాల బాల, బాలికల వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలబాలికలు ఒరిజినల్ స్కూల్ బోనఫైడ్, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో, అండర్–19 క్రీడాకారులు ఎస్‌ఎస్‌సీ ఒరిజినల్ మెమో, బోనఫైడ్, ఆధార్‌కార్డు జిరాక్స్‌తో ఉదయం 9 గంటలకు పీడీ అఫ్రోజ్‌కు రిపోర్టు చేయాలని, మిగతా వివరాల కోసం 8019970231 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.


