సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో వివిధ కోర్సులకు సంబంధించిన పరీక్ష ఫలితాలను వీసీ శ్రీనివాస్ శనివారం విడుదల చేశారు. బీఈడీ సెమిస్టర్ 2లో 71.98 శాతం, బీఈడీ 4వ సెమిస్టర్‌లో 93.48 శాతం, ఎల్‌ఎల్‌బీ 2వ సెమిస్టర్‌లో 68.85 శాతం, ఎల్‌ఎల్‌బీ 4వ సెమిస్టర్‌లో 86.85 శాతం, బీ ఫార్మసీ 4వ సెమిస్టర్ 60.40 శాతం, భీపార్మసీ 6వ సెమిస్టర్ 57.77 శాతం, ఎంఫార్మసీ 2వ సెమిస్టర్‌లో 72.22 శాతం, బీపెడ్ 2వ సెమిస్టర్‌లో 87.13 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్ ప్రవీణ తెలిపారు.కార్యక్రమంలో అడిషనల్ కంట్రోలర్ అనురాధారెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ఈశ్వర్‌కుమార్, సురేష్, గౌతమి తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ పరీక్షలు ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 47 కేంద్రాల్లో సెమిస్టర్–5కు సంబంధించి పరీక్షలు నిర్వహించారు. పీయూలో పరీక్ష సందర్బంగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో వీసీ శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని, ఎలాంటి పరిస్థితుల్లో కాపీయింగ్ జరగకుండా చూడాలని సూచించారు. అధికారులకు డ్యూటీలకు సంబంధించి ఆర్డర్స్‌ను అందించారు. కార్యక్రమంలో కంట్రోలర్ ప్రవీణ, కోఆర్డినేటర్ అరుంధతిరెడ్డి, ఈశ్వర్‌కుమార్, అర్జున్‌కుమార్, విజయ్‌భాస్కర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
రేపు బాస్కెట్‌బాల్
జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈనెల 24వ తేదీన ఉదయం 10.30 గంటలకు ఉమ్మడి జిల్లా సీనియర్ పురుషుల, మహిళల బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్ అడ్వకేట్, నసరుల్లా హైదర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డిలో ఈనెల 28 నుంచి 30 వరకు రాష్ట్రస్థాయి సీనియర్ బాస్కెట్‌బాల్ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆధార్‌కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 8897985455 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఇన్‌చార్జి అడిషనల్‌కలెక్టర్‌గా వెంకట్‌రెడ్డి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఇన్‌చార్జి స్థానికసంస్థల అడిషనల్ కలెక్టర్‌గా జెడ్పీ సీఈఓ వెంకట్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కలెక్టర్ విజయేందిర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న శివేంద్ర ప్రతాప్ పదిరోజుల పాటు వ్యక్తిగత సెలవుపై వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంకట్‌రెడ్డి డిసెంబర్ 1వ తేదీ వరకు ఇన్‌చార్జిగా ఉండనున్నారు.


