
వారం రోజులుగా తిరుగుతున్నా
మా గ్రామంలో సొంతంగా ఐదెకరాల పొలం ఉండగా.. మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని మొత్తం పదెకరాల్లో వరి వేశాను. ఉదయం 6 గంటలకు వచ్చి యూరియా కోసం లైన్‌లో నిలబడ్డా. వారం రోజులుగా తిరుగుతున్నా.. ఇంతకు ముందు యూరియా ఇంత కష్టం రాలేదు. కేవలం టోకెన్ ఇచ్చి పంపిస్తున్నారు. – శంకరమ్మ,
హస్నాపూర్, భూత్పూర్ మండలం
తెలిసినోళ్లకే ఇస్తున్నారు..
మూడెకరాల పొలంలో వరి నాట్లు వేశా ను. నాలుగు సార్లు భూత్పూర్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణానికి తిరిగినా యూరియా దొరకడం లేదు. వాళ్లకు తెలిసినోళ్లకు బస్తాలు.. బస్తాలు ఇస్తున్నారు. మా లాంటి వారికి యూరియా లేదని చెబుతుండ్రు. ఎక్కడ చూసినా స్టాక్ లేకపోవడంతో పొలం పనులు వదులుకుని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. – శంకరయ్య,
రైతు, శేరిపల్లి(హెచ్), భూత్పూర్ మండలం
●

వారం రోజులుగా తిరుగుతున్నా