
1న ఉద్యోగుల పెన్షన్ విద్రోహ దినం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సెప్టెంబర్ 1వ తేదీన ఉద్యోగుల పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నట్లు టీ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్ శుక్రవారం ఓ ప్రకనటలో తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 30వ తేదీన స్థానిక టీఎన్‌జీఓ హాల్‌లో సన్నాహాక సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని, 1వ తేదీన కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లు తరలిరావాలని పిలుపునిచ్చారు.
నేడు డయల్ యువర్ డీఎం
స్టేషన్ మహబూబ్‌నగర్: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నేడు (శనివారం) నిర్వహిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రయాణికులు తమ సూచనలు, సలహాలను 99592 26295 నంబర్‌కు తెలియజేయాలని ఆమె కోరారు.
మంచి ఆరోగ్యానికిక్రీడలు దోహదం
మహబూబ్‌నగర్ క్రీడలు: మంచి ఆరోగ్యానికి క్రీడలు, నిరంతర వ్యాయామం ఎంతో దోహదం చేస్తాయని డీడబ్ల్యూఓ జరీనా బేగం అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జాతీయ క్రీడాదినోత్సవం వేడుకలు నిర్వహించారు. ముందుగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు. క్రీడలు ఆడే వారిలో విల్‌పవర్ పెరుగుతుందన్నారు. ప్రతి రోజు పది నిమిషాల పాటు మెడిటేషన్ చేయాలని కోరారు. జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో క్రీడాకారులు ప్రతిభచాటాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని స్టేడియంలో వాలీబాల్ అకాడమీ ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం వివిధ క్రీడాపోటీల్లో గెలుపొందిన వారికి మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో క్రీడాశాఖ సూపరింటెండెంట్ రాజ్‌గోపాల్, సీనియర్ అసిస్టెంట్ రవీందర్‌రెడ్డి, కోచ్‌లు సునీల్‌కుమార్, పర్వేజ్‌పాష, అంజద్, ఖేలో ఇండియా ఫుట్‌బాల్ కోచ్ నికేష్ తదితరులు పాల్గొన్నారు.