
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇంజినీరింగ్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో 191 మంది విద్యార్థులను అలాట్ చేసిందని, వారికి కళాశాలలో ఎలా నడుచుకోవాలని, ర్యాంగింగ్, కోర్సుల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఓరియంటేషన్ అనంతరం మధ్యాహ్నం బాలబాలికలకు హాస్టల్స్‌లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబుతో పాటు పలువురు హాజరవుతారన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పకుండా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని సూచించారు. త్వరలో తరగతులు ప్రారంభం అవుతాయని, ఇప్పటికే తరగతి గదులు, హాస్టల్ గదులను సిద్ధం చేశామని తెలిపారు. కార్యక్రమంలో మోహినుద్దీన్, పీఆర్‌ఓ గాలెన్న తదితరులు పాల్గొన్నారు.