
గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్టు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని టీడీగుట్టలో గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో వన్‌టౌన్ ఎస్‌ఐ శీనయ్య తన బృందంతో దాడులు నిర్వహించి.. రాకేశ్ అనే యువకుడి నుంచి రూ. 33వేల విలువజేసే 1.325 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మరికొంత గంజాయిని మరో ఇద్దరికి విక్రయించినట్లు విచారణలో తేలిందని.. వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి డ్రగ్ టెస్టింగ్ కిట్లతో తనిఖీ చేయగా.. గంజాయి తాగినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. పోలీసులకు పట్టుబడిన రాకేశ్ గతంలో కూడా పలువురికి గంజాయి విక్రయించినట్లు తేలిందని.. వారందరి వివరాల సేకరిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు. నిందితుడిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ అప్పయ్య, ఎస్‌ఐ శీనయ్య ఉన్నారు.