
జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు ఇద్దరు పాలమూరు క్రీడాకారుల
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాలోని కౌకుంట్లకు చెందిన రాజా రాంచరణ్ జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. పంజాబ్ రాష్ట్రం లూథియానాలో వచ్చేనెల 1 నుంచి జరిగే జాతీయస్థాయి యూత్ అండర్–18 బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ జట్టుకు ఎంపికయ్యాడు. రాజా రాంచరణ్ 2023లో అండర్–14 విభాగం పాండిచ్చేరి, 2024 అండర్–16 విభాగం కోల్‌కత్తాలో జరిగిన జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో తెలంగాణ బాలుర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు మూడో జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటున్నాడు. అదే విధంగా ఇదే జాతీయస్థాయి టోర్నీలో పాల్గొనే తెలంగాణ బాస్కెట్‌బాల్ జట్టుకు బాలానగర్‌లోని ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి ఎస్.రాజేశ్వరి ఎంపికై ంది. వీరి ఎంపికపై జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మక్సూద్‌బిన్ అహ్మద్ జాకీర్ అడ్వకేట్, ప్రధాన కార్యదర్శి నసరుల్లా హైదర్, సభ్యులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ప్రతిభచాటి ఉమ్మడి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
రాజేశ్వరి
రాజా రాంచరణ్

జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు ఇద్దరు పాలమూరు క్రీడాకారుల