
వాలీబాల్‌లో అనన్యశ్రీ రాణింపు
ఉమ్మడి జిల్లాలోని మక్తల్‌కు చెందిన అనన్యశ్రీ వాలీబాల్‌లో అంచలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయస్థాయికి ఎదిగింది. 2018లో అప్పటి జిల్లా యువజన, క్రీడల అధికారిణి సత్యవాణి ఆధ్వర్యంలో పొడగరి బాలికల క్రీడా నైపుణ్య కార్యక్రమం నిర్వహించగా 180 సెంటిమీటర్లు ఎత్తుగా ఉన్న అనన్యశ్రీ వాలీబాల్ క్రీడకు ఎంపికై ంది. సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన వాలీబాల్ అకాడమీ ప్రవేశ సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచింది. 2019లో ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా అథ్లెట్ పథకం కింద కేరళలోని పట్టణమిట్టలోగల వాలీబాల్ అకాడమీకి అనన్యశ్రీ ఎంపికై 2024 ఆగస్టు వరకు శిక్షణ తీసుకుంది. గత ఏడాది క్రీడా కోటా కింద పూణేలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగం సాధించింది. మూడు సార్లు తెలంగాణ జట్టుకు, పలుసార్లు కేరళ రాష్ట్ర వాలీబాల్ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. 2023 అస్సాం రాష్ట్రం గౌవహాటిలో జరిగిన 71వ ఉమెన్ సీనియర్ నేషనల్ వాలీబాల్ పోటీలకు కేరళ రాష్ట్ర జట్టుకు అనన్యశ్రీ ప్రాతినిధ్యం వహించింది. సీనియర్ నేషనల్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో కేరళ మహిళా జట్టు విజేతగా నిలవడంతో అనన్యశ్రీ బంగారు పతకం సాధించింది. పాండిచ్చేరిలో జరిగిన ఫెడరేషన్ కప్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనగా కేరళ రాష్ట్ర జట్టు రన్నరప్‌గా నిలిచింది.
రెండు సార్లు అంతర్జాతీయ పోటీల్లో
అనన్యశ్రీ రెండుసార్లు అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో పాల్గొంది. చైనా దేశం చెంగ్డు నగరంలో 2023 ఆగస్టులో జరిగిన‘వరల్డ్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌శ్రీలో కేరళ యూనివర్సిటీ జట్టు తరపున పాల్గొంది. వియాత్నం దేశం హనోయిలో ఈ ఏడాది జూన్ 7 నుంచి 14 వరకు జరిగిన ఆసియా వాలీబాల్ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో ఆడాలన్నదే తన లక్ష్యమంటోంది అనన్యశ్రీ.