
రక్షణ చట్టం వెంటనే అమల్లోకి తేవాలి
పాలమూరు: రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు రోజురోజుకు చాలా పెరుగుతున్నాయని వీటిని కట్టడి చేయాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లోకి తీసుకురావాలని జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రావు అన్నారు. కూకట్‌పల్లిలో న్యాయవాదిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ఆందోళన చేయడం జరిగింది. ఇటీవల కాలంలో తరచూదాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వాలు అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో న్యాయవాదులపై దాడులు జరిగితే సహించేది లేదన్నారు. ప్రస్తుతం దాడికి కారకులైన వారందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే రిమాండ్‌కు తరలించాలన్నారు. ఆనంతరం సీనియర్ న్యాయవాదులు ఎన్‌పీ వెంకటేష్, చంద్రమౌళి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన న్యాయవాద వృత్తిలో ఉన్న న్యాయవాదుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం సరికాదన్నారు.
విధులు బహిష్కరించి నిరసన చేసిన న్యాయవాదులు